- కేంద్ర మంత్రి గంగ్వార్ తో సమావేశమైన మంత్రి .పితాని
.
ఇప్పటికే విశాఖపట్నంలో మాంజూరయిన 500పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ను త్వరితగతిన ప్రారంభించమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ని కోరినట్టు ఎపి కార్మిక, ఉపాధికల్పనా శాఖ మంత్రి పితాని సత్యన్నారాయణ తెలిపారు.సోమవారం న్యూఢిల్లీ లో ఆయన కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ , ఉన్నతాధికారులను కలిసి చర్చించారు.అనంతరం మంత్రి పితాని విలేకర్లతో మాట్లాడారు.
అమరావతిలో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను త్వరితగతిన ప్రారంభించమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ని కోరినట్టు ఎపి కార్మిక, ఉపాధికల్పనా శాఖ మంత్రి పితాని సత్యన్నారాయణ తెలిపారు.సోమవారం న్యూఢిల్లీ లో ఆయన కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ , ఉన్నతాధికారులను కలిసి చర్చించారు.అనంతరం మంత్రి పితాని విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే విశాఖపట్నంలో మాంజూరయిన 500పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ను త్వరితగతిన ప్రారంభించామన్నారు. ఈ అస్పుత్రుల విషయమై సంబంధించి మారిన నిబంధనల ప్రకారం కొత్త వివరాలు సమర్పించమని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారని చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.ఇప్పటికే నిర్మాణం పూర్తయిన తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ ను ఏప్రిల్ 9న ప్రారంభించమని కేంద్రమంత్రిని కోరామని చెప్పారు.ఇప్పటికే ఉన్న 13 హాస్పిటల్స్ ను అప్ గ్రేడ్ చేయమని కోరాను. ఈ మధ్య కొత్తగా 3 హాస్పిటల్స్ ను రాష్ట్రానికి మంజూరు చేసినందుకు కృతఘ్నతలు తెలిపాను.
చంద్రన్న భీమా పథకం అమలులో ఎదురయ్యే సమస్యలను, ఆ పథకం కింద చెల్లించే ఇన్సూరెన్స్ మొత్తాన్ని కేంద్రం ఇస్తున్నదానికంటే, రాష్ట్రప్రభుత్వం ఎక్కువగా ఇస్తుంది కాబట్టి దీన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయమని కోరామన్నారు.
రాష్ట్రంలో మొత్తం 30లక్షల మంది ఈఎస్ఐ అర్హులు ఉంటే అందులో కేవలం 14లక్షల మందే సభ్యత్వం నమోదు చేయించుకున్నారు, మిగిలిన కొత్త వారిని నమోదు చేయించుకునేందుకు అవకాశం ఇవ్వమని కోరాము. దానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి పితాని చెప్పారు.