YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భాజపా ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం ఆశీర్వాదం తీసుకునేందుకు వంగిన అభ్యర్థి మెడలో చెప్పుల దండ

 భాజపా ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం ఆశీర్వాదం తీసుకునేందుకు వంగిన అభ్యర్థి మెడలో చెప్పుల దండ
మధ్యప్రదేశ్‌లోని నగడాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన భాజపా ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం ఎదురైంది. గ్రామస్థుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునేందుకు వంగిన భాజపా అభ్యర్థి మెడలో ఓ వ్యక్తి చెప్పుల దండ వేసి అవమానపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నగాడా-ఖచురాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపాకు చెందిన దిలీప్‌ సింగ్‌ షెఖావత్‌ బరిలోకి ఉన్నారు.ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజల ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆయన ఆ ప్రాంతానికి వెళ్లారు. దీంతో అందరూ ఆయనకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నిలబడి ఉన్న గ్రామస్థుల ఆశీర్వాదం తీసుకునేందుకు అభ్యర్థి కిందకు వంగారు. ఆ సమయంలో ఓ వ్యక్తి షెఖావత్‌ను కలిసేందుకు దగ్గరకు వచ్చి వెంటనే చెప్పుల దండను మెడలో వేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన షెఖావత్‌ అనుచరులు అతడిని పట్టుకొని కొట్టారు. అయితే.. అసలు ఆ వ్యక్తి అలా చేయడానికి గల కారణం తెలియరాలేదు.మధ్యప్రదేశ్‌లో నవంబరు 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. డిసెంబరు 11న ఫలితాలు వెలువడనున్నాయి.

Related Posts