ప్రముఖ నటి రేణూ దేశాయ్ తన కవితల సంకలనం పుస్తకాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఒక యూట్యూబ్ ఛానల్ లో లైవ్ లో మాట్లాడుతూ ఈ సమాచారాన్ని అందించారు. ఈ పుస్తకంలో తాను రాసిన 31 కవితలు ఉన్నాయని చెప్పారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఈ కవితలు ఉన్నాయని, ఇందులో 15 కవితలను తెలుగులోకి అనంత శ్రీరామ్ ట్రాన్స్ లేట్ చేశారని చెప్పారు. తన వివాహం గురించి, తమ పిల్లలు అకీరా, ఆదిత్య గురించి ప్రశ్నలు అడగొద్దని, ఈ విషయాలను ప్రస్తావించేందుకు మరోసారి మాట్లాడతానని అన్నారు.