దర్శకుడు పూరి జగన్నాధ్.. హీరో రామ్ వరుస పరాజయాలతో ఉన్నారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి.రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన యాక్షన్ తో ఈ కథ కొనసాగనుంది. పూరి సొంత బ్యానర్ .. స్రవంతి మూవీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.
మరో వైపున పూరి తన తనయుడు ఆకాశ్ హీరోగా చేయనున్న సినిమాకి సంబంధించిన పనులను కూడా చక్కబెడుతూనే వున్నాడు. అనిల్ అనే కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.