ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు పారిశుద్ధ్య కార్మికులు చెత్త కుమ్మరించారు. జీవో నెంబరు 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా ఐదో రోజు ఎమ్మెల్యే ఇంటి ముందు చెత్త పోసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకుని, చెత్తను తీసేయించి.. కార్మికులను అక్కడి నుంచి పంపించేశారు.