బాలీవుడ్ లో ‘మీ టూ’ ఉద్యమం సృష్టించిన ప్రకంపనలు అంత ఇంత కాదు. ఈ ఉద్యమం దెబ్బకు నటులు నానపటేకర్, అలోక్ నాథ్ లతో పాటు దర్శకుడు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ లు కీలక ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అలోక్ నాథ్ తనపై అత్యాచారం చేశాడని నిర్మాత, నటి వినీతా నందా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆమె పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓషివారా పోలీసులు అలోక్ నాథ్ పై రేప్ కేసు నమోదుచేశారు.