ఫేవరేట్ గా బరిలో దిగిన భారత్ బోల్తా కోటింది. ఆస్ట్రేలియా భారత్ ఫై 4 పరుగుల తేడాతో గెలిచింది. ఆసీస్ పర్యటనలో భాగంగా ఈ రోజు మొదటి టీ20 ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమిండియా బౌలింగ్‌ను ఉతికేసింది. గ్లెన్ మాక్స్‌వెల్ (46; 24 బంతుల్లో 4×4), మార్కస్ స్టొయినిస్ (33 నాటౌట్; 19 బంతుల్లో 3×4, 1×6) పరుగుల వరద పారించారు. వీరి కన్నా ముందు క్రిస్‌లిన్ (37; 20 బంతుల్లో 1×4, 4×6) బీభత్సంగా ఆడాడు. ఆరోన్ ఫించ్ (27; 24 బంతుల్లో 3×4) రాణించాడు. కుల్‌దీప్ యాదవ్ 2, బుమ్రా, ఖలీల్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా భారత్ కు 17 ఓవర్లలో 174 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించారు. తరువాత బ్యాటింగ్ కి వచ్చిన భారత్ నిర్ణిత ఓవర్లలో 169 పరుగులు చేసింది. భారత బాట్స్మన్ లో ధావన్ 76(42) పరుగులు చేసాడు. జాంప, స్టయినిస్ తల రెండు వికెట్లు తీశారు..