- సిగ్గుచేటన్నా రాహుల్ గాంధీ
- వివరణ ఇచ్చుకున్నఆర్ఎస్ఎస్
- భారత ఆర్మీ, ఆర్ఎస్ఎస్ మధ్య పోలికే లేదు
భారత ఆర్మీ సన్నద్ధతకు ఆరు, ఏడు మాసాల సమయం పడితే...ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సన్నద్ధతకు మూడు రోజుల సమయం చాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదంరేపుతున్నాయి. మోహన్ భగవత్ వ్యాఖ్యలు భారత ఆర్మీని అగౌరవపరిచేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళా సీఎం పినరయి విజయన్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో పాటు పలువురు విపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు.
ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ వివరణ ఇచ్చింది. భారత ఆర్మీ, ఆర్ఎస్ఎస్ మధ్య పోలికే లేదని...సాధారణ సమాజం, ఆర్ఎస్ఎస్ మధ్యే పోలికంటూ ఆర్ఎస్ఎస్ నేత మన్మోహన్ వైద్య వివరణ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల క్రమశిక్షణను నొక్కి చెప్పేందుకు భగవత్ చేసిన వ్యాఖ్యలు వక్రీకరణకు గురైయ్యాయన్నారు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, రాజ్యాంగం కోరినప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సేవలు అందిస్తారని మాత్రమే భగవత్ చెప్పారని వ్యాఖ్యానించారు.