YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఎల్లుండి నుంచి డీఎస్సీ వెబ్ ఆప్షన్లు

ఎల్లుండి నుంచి డీఎస్సీ వెబ్ ఆప్షన్లు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన షెడ్యూలును ఏపీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ 2018 (డీఎస్సీ) విడుదలచేసింది. ఈ షెడ్యూలు ప్రకారం అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సంబంధించి వెబ్‌ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ కొన్ని పోస్టులకు గురువారం నుంచి.. మరికొన్ని పోస్టులకు శనివారం (నవంబరు 24) నుంచి ప్రారంభంకానుంది. నవంబరు 28 వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్జీటీ పోస్టులకు మాత్రం డిసెంబరు 3 నుంచి 9 వరకు పరీక్షకేంద్రాల కోసం ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 6 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. విభాగాల వారీగా 2019 జనవరి 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్ డౌన్‌లోడ్ షెడ్యూలును కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఏపీలో మొత్తం 7,729 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయగా మొత్తం 6,08,157 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 6,26,788 మంది అభ్యర్థులు ఫీజుచెల్లించగా.. వారిలో 18,631 దరఖాస్తులను హాల్‌టికెట్ నెంబర్లు సరిగా నమోదుచేయలేకపోయారు. 
వెబ్ ఆప్షన్ల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ షెడ్యూలు.. 
పోస్టులు వెబ్ ఆప్షన్స్
స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) 22.11.2018 - 28.11.2018
స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) 22.11.2018 - 28.11.2018
పీజీటీ 22.11.2018 - 28.11.2018
టీజీటీ, ప్రిన్సిపల్స్ 24.11.2018 - 28.11.2018
లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ & డ్రాయింగ్ 24.11.2018 - 28.11.2018
ఎస్జీటీ 03.12.2018 - 09.12.2018
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ షెడ్యూలు.. 
పోస్టులు హాల్‌టికెట్ డౌన్‌లోడ్
స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) 01.12.2018 నుంచి
స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) 03.12.2018 నుంచి
పీజీటీ 05.12.2018 నుంచి
టీజీటీ, ప్రిన్సిపల్స్ 09.12.2018 నుంచి
లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ & డ్రాయింగ్ 09.12.2018 నుంచి
ఎస్జీటీ 17.12.2018 నుంచి

Related Posts