YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో వడివడిగా పార్టీ ఆఫీసులు

ఏపీలో వడివడిగా పార్టీ ఆఫీసులు
రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయ భవనాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టిడిపి, వైసీపీ కార్యాలయాల నిర్మాణం త్వరలోనే పూర్తికానుంది. రానున్న ఎన్నికల నాటికి ఆ రెండూ కొత్త భవనాల నుంచే తమ రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. జనసేన కార్యాలయ నిర్మాణానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. టిడిపి కార్యాలయాన్ని నిర్మిస్తూ ఉండగా, వైసీపీ, జనసేన పార్టీల అధ్యక్షుల నివాస, పార్టీ కార్యాలయ భవనాలు ఒకే ప్రాంగణంలో ఉండనున్నాయి. అవి తాత్కాలిక కార్యాలయాలేనని, భవిష్యత్తులో పెద్దవి నిర్మించుకుంటామని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు పార్టీలు విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారికి అత్యంత సమీపంలోనే వీటిని నిర్మిస్తున్నాయి.తెలుగుదేశం కార్యాలయం.. మంగళగిరికి దగ్గరలో జాతీయ రహదారికి పక్కన నాలుగు ఎకరాల విస్తీర్ణంలో తెలుగుదేశం కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో కార్యాలయం ప్రారంభించే అవకాశం ఉంది. మూడు భవనాల్ని ప్రి ఫ్యాబ్రికేటెడ్‌ విధానంలో నిర్మిస్తున్నారు. మూడు భవనాల్లో నిర్మిత ప్రాంతం సుమారు 2.50 లక్షల చ.అడుగులు. ఒకటి, మూడు భవనాలు జీ+3 విధానంలో, రెండో భవనాన్ని జీ+2 విధానంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మొదటి భవనంలో ఒక అంతస్తులో కొంత భాగం పనులు మిగిలి ఉన్నాయి. మూడో భవనంలో చివరి అంతస్తుకి శ్లాబ్‌ వేయాల్సి ఉంది. రెండో భవన నిర్మాణం గ్రౌండ్‌ లెవల్‌కి వచ్చింది. పార్టీ కార్యాలయం నుంచే వీడియో, టెలికాన్ఫరెన్స్‌లు వంటివి నిర్వహించేందుకు అవసరమైన వసతులన్నీ ఉంటాయి.వైసీపీ... తాడేపల్లిలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయానికి, పార్టీ అధ్యక్షుడు జగన్‌ నివాసానికి వేర్వేరు భవనాలు నిర్మిస్తున్నారు. జీ+1 విధానంలో నిర్మిస్తున్నారు. ఇది పార్టీ శాశ్వత కార్యాలయం కాదని, భవిష్యత్తులో దీన్ని పార్టీ అధ్యక్షుడు క్యాంప్‌ ఆఫీసుగా వినియోగించుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తయింది. అంతర్గత పనులు జరుగుతున్నాయి. కార్యాలయ నిర్మాణం చివరి దశలో ఉంది. అన్ని హంగులతో వీటిని సిద్ధం చేసేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుంది. జనసేన కార్యాలయం, ఇల్లు... కాజ గ్రామానికి సమీపంలో జనసేన పార్టీ కార్యాలయం, పవన్‌ కల్యాణ్‌ ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇంటి పనులు జరుగుతున్నాయి. కార్యాలయ పనులు ప్రారంభించాల్సి ఉంది. రెండు ఎకరాల్ని, రెండు భాగాలుగా విభజించి మధ్యలో రోడ్డు వేశారు. రోడ్డుకి పశ్చిమం వైపు ఇంటిని... తూర్పు భాగంలో కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. జీ+1 విధానంలో నిర్మించనున్నారు. ఇక్కడ నిర్మించబోయేది పార్టీ శాశ్వత రాష్ట్ర కార్యాలయం కాదని, పవన్‌ కల్యాణ్‌ క్యాంప్‌ ఆఫీస్‌గానే అది ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.

Related Posts