YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

డిసెంబర్ 16న ఎన్టీఆర్ ఆడియో

 డిసెంబర్ 16న ఎన్టీఆర్ ఆడియో
తెలుగువారు ‘అన్న’ అని పిలుచుకునే మహా నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్యభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి(క్రిష్) తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరపుకుంటోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ సినీ చరిత్రను ఒక భాగంగా, రాజకీయ జీవితాన్ని రెండో భాగంగా తెరపై ఆవిష్కరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో దర్శక నిర్మాతలు చిత్ర ప్రచారాలపై దృష్టి సారించారు. త్వరలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా తొలుత ఆడియో విడుదల వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 16న ఆడియో విడుదల వేడుక నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరం, శ్రీవేంకటేశ్వరుడి సన్నిధి అయిన తిరుపతిలో ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మహా వేడుకకు తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ ట్రైలర్‌ను కూడా ఈ ఆడియో విడుదల కార్యక్రమంలోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, తొలి భాగం ఆడియో విడుదల తర్వాత రెండో భాగం ఆడియో లాంచ్ ఉంటుందట. బహశా రెండో భాగం ‘యన్.టి.ఆర్ - మహానాయకుడు’ ఆడియో విడుదల వేడుకను తెలంగాణలో నిర్వహించొచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడిగా రానా, హరికృష్ణగా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Related Posts