YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రేమ కోసం ఫ్రెండ్ ను చంపేశాడు

ప్రేమ కోసం ఫ్రెండ్ ను చంపేశాడు
తన స్నేహితుడు ప్రేమిస్తున్న అమ్మాయిపైనే ఇష్టం పెంచుకున్నాడో యువకుడు. ఆ అమ్మాయి ప్రేమ పొందడానికి అతణ్ని కిరాతకంగా హత్య చేశాడు. అతణ్ని కత్తితో నరికేసి తల, మొండెం వేరు చేశాడు. ముంబైలోని విరార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్ భావ్‌ధానే (19) అనే యువకుడు తనకు పరిచయం ఉన్న ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా అతణ్ని ఇష్టపడటంతో ఇద్దరూ కలిసి తరచూ నగరంలో చక్కర్లు కొట్టేవారు. అయితే.. వికాస్ మిత్రుడు వరాక్ కూడా అదే అమ్మాయిపై ఇష్టం పెంచుకున్నాడు. సదరు అమ్మాయితో వరాక్‌కు కూడా పరిచయం ఉన్నా.. అతడిది మాత్రం వన్ సైడ్ లవ్. వికాస్‌కు ప్రాణ స్నేహితుడు కావడంతో తరచూ ముగ్గురు కలిసి బయటకు వెళ్లేవారు. అయితే.. స్నేహం మాటున వరాక్ చేస్తున్న ద్రోహాన్ని మాత్రం వికాస్ పసిగట్టలేకపోయాడు. ఆ అమ్మాయి తనకు దక్కాలంటే వికాస్‌ను వదిలించుకోవడమే మార్గమని భావించిన వరాక్ అతణ్ని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు.  అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ముంబైలోని విరార్ ప్రాంతంలోని ఖాదన్ రోడ్డులో ఓ యువకుడి మృతదేహాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బాధితుణ్ని కత్తితో నరికి చంపినట్లుగా గుర్తించారు. మృతదేహానికి 70 మీటర్ల దూరంలో అతడి తలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడ నుంచి కొన్ని ఆధారాలు సేకరించారు. బాధితుడి బ్యాగులో ఉన్న ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ ఆధారంగా అతణ్ని వికాస్‌గా గుర్తించారు. అదే బ్యాగులో తన గర్ల్‌ఫ్రెండ్, వరాక్‌తో కలిసి అతడు దిగిన ఫొటోను కూడా గుర్తించారు. హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేశారు.బాధితుడి కుటుంబసభ్యులు, స్నేహితులతో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించిన పోలీసులు అతడి ప్రియురాలు సాయంతో వరాక్‌ను ఓ చోటకు రప్పించారు. అతణ్ని అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ డేటాను ట్రాక్ చేయగా.. హత్య చేయడానికి ముందు వికాస్‌తో వరాక్ చాలా సేపటి వరకు మాట్లాడినట్టు గుర్తించారు. స్థానికంగా ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న వరాక్.. పక్కా ప్రణాళికతోనే వికాస్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముగ్గురి జీవితాల్లో విషాదం నింపింది. అమ్మాయిని ప్రేమించిన పాపానికి తమ కుమారుడు దారుణ హత్యకు గురవడంతో బాధితుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు

Related Posts