మచిలీపట్నం బస్టాండ్ వర్షాకాలంలో ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాగే పామర్రు బస్టాండ్ డ్రైనేజ్ విషయమై తమరు నిధులు మంజూరు చేసి. పనులు మొదలు పెట్టాలి.
పామర్రు బస్టాండ్ నాలుగు మండలాలకు జంక్షన్ పాయింట్. ఇక్కడ బస్సులు రెండు వందల ట్రిప్పులు వచ్చిపోతూ ఉంటాయి. రమారమి ఐదువేల మంది ప్రయాణికులు పామర్రు బస్టాండ్ కు వచ్చి వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ డిపో మేనేజర్ లేదా ఇతర సూపర్వైజర్ స్టాప్ లేకపోవటం వలన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అవుట్సోర్సింగ్ విధానంలో ఇద్దరు ఎంక్వయిరీ మరియు చార్ట్ మెయింటెనెన్స్ స్టాఫ్ ను నియ మించినట్లయితే, బస్సు రాక పోకలను వారు ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేయవచ్చు, అలాగే బస్సుల వివరములను కూడా రికార్డ్ చేయవచ్చు. పామర్రు ప్రయాణికులకు చాలా సహాయం అవుతుంది. ఒక మొబైల్ ఫోన్ కూడా ఎంక్వయిరీ సెంటర్ కు ఇచ్చినట్లయితే ఏమైనా కంప్లైంట్ ఉన్నప్పుడు, అధికారులకు తెలియ చేయటానికి ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుంది.
కావున మచిలీపట్నం పామర్రు బస్టాండ్ ల సమస్యలపై కొద్దిగా పరిశీలన చేసి తగు సహాయం అందజేయగలరు.