YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ తో ఘట్ బంధన్ కష్టమే...

 కాంగ్రెస్ తో ఘట్ బంధన్ కష్టమే...
బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక తాటి మీదకు తెచ్చి ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన పార్టీ బీజేపీని దెబ్బకొట్టాలన్న చూస్తున్న విపక్షాల ఐక్యత సాధ్యమవుతుందా? లేదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. బలం ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ పొత్తులకు అంగీకరించడం లేదు. బలం లేని చోట, బలమైన ప్రత్యర్థి ఉన్న చోట మాత్రం పొత్తుల కోసం వెంపర్లాడుతుండటటమే ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టేందుకు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీపార్టీలు కలవకపోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో బహుజన్ సమాజ్ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తొలుత పొత్తులపై చర్చలు ప్రారంభమయినప్పటికీ కాంగ్రెస్ స్థానిక నాయకత్వం బీఎస్పీతో కలసి పోటీ చేసేందుకు విముఖత చూపడమే. ఈ మూడు రాష్ట్రాల్లో తమకు అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని గ్రహించిన కాంగ్రెస్ లోకల్ నాయకత్వం బీఎస్పీని లైట్ గా తీసుకుంది. దీంతో ఎక్కడా ప్రధాన పార్టీ అయిన బీఎస్పీతో పొత్తు కుదరకపోవడంతో మాయావతి ఒంటరిగానే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఛత్తీస్ ఘడ్ లో అజిత్ జోగి పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. పొత్తులు కుదుర్చుకుంటే ఎక్కువ సీట్లు వదులుకోవాల్సి వస్తుందన్న స్థానిక నాయకత్వం అత్యాశే రాష్ట్రాలలో కూటమి ఏర్పాటు సాధ్యం కాలేదన్న వాదన బలంగా ఉంది. దీనికి తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. తమకు బలం లేదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని అఖిలేష్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు కూటమి ఏర్పాటుకు అడ్డంకి ఏంటో చెప్పకనే చెబుతున్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీకి వ్యతిరేకింగా అన్ని పార్టీలూ జత కట్టి ఉంటే గెలుపు సునాయాసమయ్యేదన్న ఆయన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్ని పార్టీలూ అవలంబించే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో జత కట్టేందుకు ఎస్పీ, బీఎస్పీలు విముఖత చూపే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా. ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ పై ఈ రెండు పార్టీల నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పొత్తులు కాంగ్రెస్ కు అవసరం కాబట్టి అప్పుడు ఈ పార్టీలు తమ ప్రతాపం చూపుతాయంటున్నారు. మొత్తం మీద మోదీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు అంత సులవుకాదని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే సీపీఎం పార్టీ ఎన్నికల అనంతరం పొత్తులే బెస్ట్ అని చెబుతుండటం గమనార్హం.

Related Posts