మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ రోజు జరగనుంది. ముందుగా టాస్ గెలిచిన భారత సారథి విరాట్ కోహ్లీ.. ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. మరోవైపు ఆసీస్ జట్టులో స్టాన్లేక్ స్థానంలో కౌల్టర్ నైల్ బరిలోకి దిగుతున్నట్లు ఆ జట్టు సారథి అరోన్ ఫించ్ తెలిపాడు.