భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20 రద్దైంది.మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఆసీస్ 19 ఓవర్లకు 132/7తో నిలిచింది. వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత కోహ్లీసేన లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ విధానంలో 137కు సవరించారు. టీమిండియా ఛేదన ఆరంభం అవుతుందనగా వర్షం మళ్లీ కురిసింది. మరోసారి వర్షం రావడం వల్ల టీమిండియా ఇన్నింగ్స్‌ను 11 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 90గా నిర్ణయించారు. మైదానం సిద్ధం కాగానే వరుణుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. వర్షం కారణంగా ఆట రద్దవ్వడం అభిమానులను నిరాశపరిచింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ఆతిధ్య జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది.