తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత నిలువెత్తు చిత్రపటాన్ని అసెంబ్లీలో మంగళవారంనాడు ఆవిష్కరించారు.
ఏడడుగుల ఈ చిత్రపటాన్ని స్పీకర్ పి.ధన్‌పాల్ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆవిష్కరించగా, ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తదితరలు హాజరయ్యారు.
అయితే జయ చిత్రపటం ఆవిష్కరించిన గంటకే డీఎంకే ఈ వ్యవహారాన్ని రచ్చకీడ్చింది. అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు దోషిగా నిర్దారించిన జయలలిత ఫోటోను తక్షణం తొలిగించాల్సిందిగా ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.