YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

డీఎస్సీ కొత్త షెడ్యూల్

డీఎస్సీ కొత్త షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయు పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ (టెట్ కమ్ టీఆర్టీ) పరీక్షల కొత్త షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ శుక్రవారం (నవంబరు 23) విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 6 నుంచి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2019 జనవరి 3న నిర్వహిాంచే ఎస్జీటీ పరీక్షలతో డీఎస్సీ పరీక్షలు పూర్తవుతాయి. ఆయా తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు. కొన్ని పరీక్షలను మూడు సెషన్లలోనూ నిర్వహించనున్నారు. ఏపీలో మొత్తం 7,729 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయగా మొత్తం 6 లక్షలకు పైచిలుకు దరఖాస్తులు అందాయి. పరీక్ష కేంద్రాల ఎంపికకు సంబంధించి ఇప్పటికే వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ కూడా మొదలైంది. పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ వివరాలను కూడా ఇప్పటికే ప్రకటించారు. 
స్టులు హాల్‌టికెట్ డౌన్‌లోడ్
స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) 01.12.2018 నుంచి
స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) 03.12.2018 నుంచి
పీజీటీ 05.12.2018 నుంచి
టీజీటీ, ప్రిన్సిపల్స్ 09.12.2018 నుంచి
లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ & డ్రాయింగ్ 09.12.2018 నుంచి
ఎస్జీటీ 17.12.2018 నుంచి

Related Posts