పౌర, సైనిక అవసరాల కోసం ఉద్దేశించినవి
- ప్రాంతీయ సమతుల్యం దెబ్బతింటుందని ఆందోళన
- మీడియాతో పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి
భారత విజయాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేనట్టుంది. ఇస్రో 'కార్టోశాట్2ఎస్' ఉపగ్రహం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడమే దీనికి కారణం. కార్టోశాట్2ఎస్ ను ఇస్రో ఈ రోజు విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగానికి ముందే పాక్ తన అభ్యంతరాలను బాహాటంగా వ్యక్తీకరించింది.
ప్రయోగం వెనుక రెండు రకాల ఉద్దేశ్యాలు ఉన్నాయని పేర్కొంది. మిలటరీ, పౌర అవసరాల కోసం చేస్తున్న ఈ ప్రయోగం ప్రాంతీయ వ్యూహాత్మక సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మీడియా కథనాల ప్రకారం చూస్తే, భారత్ ప్రయోగిస్తున్న అన్ని రకాల అంతరిక్ష టెక్నాలజీలు, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు పౌర, సైనిక అవసరాల కోసం ఉద్దేశించినవే’’ అని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ మీడియాతో అన్నారు.