ఇండియా తో టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ లో ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ బరిలోకి దిగనున్నాడు. ఫాస్ట్‌బౌలర్ బిల్లే స్టాన్లేక్ గాయం కారణంగా అతనికి బదులుగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు కౌల్టర్‌నైల్‌ను బరిలోకి దింపింది. అయితే సిరీస్‌ను ఫలితాన్ని నిర్ణయించనున్న చివరి టీ20కి కీలక బౌలర్ స్టార్క్ అందుబాటులో ఉంటాడని ఫించ్ పేర్కొన్నాడు. ఎంతో అనుభవం ఉన్న స్టార్క్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుతంగా రాణించగలడు. ఈ ఎడమ చేతి వాటం బౌలర్ ఆసీస్ తరఫున టీ20ల్లో బరిలోకి దిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. భర్త ఆసీస్ మధ్య జరగనున్న మూడో టీ 20 సిడ్నీ వేదికగా జరగునన్నది.