రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడు అని, ఆంధ్రప్రదేశ్ ను ఒక స్కిల్, వర్క్ ఫోర్స్ హబ్గా, నాలెడ్జ్ స్టేట్ గా మార్చడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారని తెలిపారు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని 8 లక్షల నిరుద్యోగులకు ప్లేస్మెంట్ లింక్డ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, ఇప్పటివరకు 6.50 లక్షల నిరుద్యోగులు వివిధ రంగాలలో శిక్షణ తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 188 సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో లో, 237 ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లలో 391 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో, 271 ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్పై శిక్షణ తరగతులు నిర్వహించామని, రాష్ట్రంలో 36 టెక్నికల్ స్కిల్స్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా రాష్ట్రంలో నీ 6 లక్షల మంది నిరుద్యోగులకు సిమెన్ సంస్థతో 3 వేల కోట్ల రూపాయల ఖర్చుతో టెక్నికల్ ఇష్యూస్ పై నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని లక్ష మంది నిరుద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఆమెజాన్ కూడా ముందుకు వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 20 ప్రధాన విభాగాలలో శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు, వాటిలో ముఖ్యమైనవి కన్స్ట్రక్షన్ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, ఫిషింగ్, ఆటోమొబైల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, పవర్ అండ్ ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్ మరియు ఫార్మసి, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఈ ప్రధాన రంగాలలో గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది, ప్రతి జిల్లాలోనూ ఒక స్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగ యువత నిరుద్యోగ భృతి పొందుతున్నారని తెలిపారు, తెలుగుదేశం ప్రభుత్వం 400 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాలను మెరుగుపరుస్తుందని, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు, ట్రైబల్ వెల్ఫేర్ ఏరియాలో ని విద్యార్థుల ను క్రీడారంగంలో మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం 125 కోట్ల రూపాయలతో క్రీడ స్థలాలను అభివృద్ధి పరుస్తుంది అని తెలిపారు, 146 కోట్ల రూపాయలతో సోషల్ వెల్ఫేర్ ఏరియాలలో క్రీడా మైదానాల అభివృద్ధి పరచడానికి కేటాయించిందన్నారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి నగరాలను స్పోర్ట్స్ సిటీలుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయల ఖర్చు పెడుతుందని తెలిపారు.