అగ్రిగోల్డ్ బాధితులపై సీఎం చంద్రబాబు నాయుడు దురుసుగా ప్రవర్తించారు. తమకు న్యాయం చేయాలని కోరిన అగ్రిగోల్డ్ బాధితుడు సిద్ధేశ్వర్ను హుంకరించిన చంద్రబాబు అసహనంతో చేయెత్తారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా పొరాడుతున్నా ఎలాంటి న్యాయం జరగలేదని చంద్రబాబు ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రిమంలోనే బాధితుడు సిద్ధేశ్వర్, చంద్రబాబును నిలదీయగా.. ‘హే .. వినయ్యా నువ్వు!, ఆ కోర్టు వుంది కదా.. ఎవడేం చేస్తాడు. వేరే స్టేట్లో ’ అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. మిగిలిన రాష్ట్రాల కంటే తానే బాగా చేస్తున్నానంటూ చంద్రబాబు కోపంతో ఊగిపోయారు. అగ్రిగోల్డ్ విషయంలో చేయాల్సిందంతా చేస్తున్నామంటూ అసహనంతో చంద్రబాబు మండిపడ్డారు. కాగా, సీఎం వైఖరిని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తీవ్రంగా ఖండించింది.