YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చిన్న పిల్లల సినిమా గా 2.0

 చిన్న పిల్లల సినిమా గా 2.0
రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘2.0’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10వేల థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది. రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ భారీ చిత్రం విడుదలకు ముందే రూ.120 కోట్ల బిజినెస్ చేసేసింది. 3డి విజువల్స్, 4డి సౌండ్ వంటి అధునాతన టెక్నాలజీతో వస్తోన్న ‘2.0’ను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తున్నారు. దీనికి కారణం ఆయన సమర్పణలో వస్తోన్న ‘భైరవగీత’ సినిమా.రాంగోపాల్ వర్మ సమర్పణలో ధనంజయ, ఇరా మోర్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భైరవగీత’. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మితమైంది. ఈ చిత్రానికి కథ, కథనాన్ని వర్మ అందించారు. వర్మ శిష్యుడు, తెలుగబ్బాయి సిద్ధార్థ తాతోలు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈనెల 22న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ముందు ప్రకటించినా ఆ తరవాత 29కి వాయిదా వేశారు. అదే రోజు రజినీకాంత్ ‘2.0’ కూడా విడుదలవుతోంది. దీంతో ‘2.0’కు ‘భైరవగీత’ పోటీ అని వర్మ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘2.0’ క్రేజ్‌ను తన సినిమాకు వాడుకోవాలనే స్ట్రాటజీతో వర్మ ఈ ప్రచారం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.  రోబో ‘2.0’కు పోటీగా ‘భైరవగీత’ విడుదల చేస్తున్నాడని కొత్త దర్శకుడు సిద్ధార్థను మెగా డైరెక్టర్ శంకర్ ఎగతాళి చేస్తున్నట్లున్నారని.. సిద్ధార్థను చూసి శంకర్ నవ్వుతున్నారని ఇప్పటికే ట్విట్టర్ ద్వారా వర్మ సెటైర్లు వేసేశారు. ఇప్పుడు తాజాగా ‘2.0’ చిన్న పిల్లల సినిమా అంటూ తీసిపారేశారు. ‘రోబో 2.0 ఒక చాలా పెద్ద డైరెక్టర్ చిన్న పిల్లల కోసం తీసిన సినిమా. భైరవగీత ఒక చిన్న పిల్లోడు పెద్ద వాళ్లకోసం తీసిన సినిమా’ అని వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘2.0’ గురించే ప్రచారం బాగా జరుగుతోంది. దీని మధ్యలో ‘భైరవగీత’ను ఇరికించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలని వర్మ చూస్తున్నారు. మరి ‘2.0’ ముందు ‘భైరవగీత’ నిలుస్తుందో లేదో చూడాలి! 

Related Posts