YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్‌కు నన్ను ఎదిరించే ధైర్యం లేదు వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు

 కాంగ్రెస్‌కు నన్ను ఎదిరించే ధైర్యం లేదు     వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు
మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలు మాటల్లో పదును పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రచారం జోరందుకుంది. అయితే ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్‌లోని ఛతుర్పూర్‌ రోడ్‌ షోలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు.‘కాంగ్రెస్‌కు నన్ను ఎదిరించే ధైర్యం లేదు. నా ఎదురుగా వచ్చి ఆపార్టీ నాయకులు ఎవరూ మాట్లాడలేరు. అందుకే వాళ్లు మా అమ్మ ప్రస్తావన తెచ్చారు. వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు. మధ్య ప్రదేశ్‌ ప్రజలకు కాంగ్రెస్‌ పరిపాలన ఎలా ఉంటుందో బాగా తెలుసు. అన్నేళ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏం చేసిందో చెప్పడానికి వాళ్లకు మాటలు రావు. కేంద్రంలో నాలుగు సంవత్సరాల నా పాలనకు నలభై సంవత్సరాల వారి పాలనకూ ఇప్పుడు పోటీ జరుగుతోంది. ప్రజలే మాకు హైకమాండ్‌ అన్న సంగతి మరోసారి రుజువు చేస్తాం. రైతులకు సాగునీరు, యువతకు ఉద్యోగాలు, పిల్లలకు నాణ్యమైన విద్యే భాజపా ధ్యేయం. మా లక్ష్యానికి ఎవరైనా అడ్డుగా వస్తే ఊరుకోం. అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. సంస్థలైనా, వ్యక్తులైనా సరే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే మధ్యప్రదేశ్‌ అభివృద్ధి కుంటుపడుతుంది. పదిహేనేళ్లలో ఈ రాష్ట్రాన్ని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎంతో అభివృద్ధి చేశారు. మీరు మళ్లీ అభివృధ్ధికే ఓటేస్తారని నా నమ్మకం. మధ్యప్రదేశ్‌ ప్రజలు అవినీతి వైపు వెళ్లరని అనుకుంటున్నాను’ అని మోదీ అన్నారు.

Related Posts