మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తరువాత బ్యాటింగ్ కి దిగిన భరత్ కి సారథి విరాట్ కోహ్లీ (61; 41 బంతుల్లో 4×4, 2×6) టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో అజేయంగా నిలిచి అర్ధశతకం సాధించాడు. కష్టాల్లో పడ్డ భారత్‌ను అతడు అద్భుతమైన ఆటతో గట్టెక్కించాడు. శిఖర్ ధావన్ (41; 22 బంతుల్లో 6×4, 2×6), దినేశ్ కార్తీక్ (22 నాటౌట్; 18 బంతుల్లో 1×4, 1×6) రాణించారు