YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఏఎస్పీ సునీత కేసులో వెలుగులోకి కొత్త నిజాలు

 ఏఎస్పీ సునీత కేసులో వెలుగులోకి కొత్త నిజాలు

 వివాహేతర సంబంధం కేసులో సస్సెండ్ అయిన ఏఎస్పీ సునీతారెడ్డి కేసు కొత్తమలుపు తిరిగింది. దాదాపు పదేళ్ల క్రితమే ఓ ప్రముఖ యాంకర్ సోదరుడితో సునీతకు వివాహమైందని, ఈ వివాహ విషయాన్ని దాచి ఆమె సురేందర్ రెడ్డిని పెళ్లి చేసుకుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్య సమాజ్‌లో లెనిన్, సునీతల వివాహం జరిగినట్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన ఆమె భర్త సురేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆ ఫోటోలో ఉన్నది సునీతేనా? అన్న సందేహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకెళితే.. తన భార్య సునీతారెడ్డి పోలీసుశాఖకు చెందిన మల్లిఖార్జున రెడ్డి అనే అధికారితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న విషయాన్ని ఆమె భర్త సురేందర్ రెడ్డి బట్టబయలు చేసి ఉన్నతాధికారులకు ఇటీవలె ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసు ఉన్నతాధికారులు తమ శాఖ పరువు ప్రతిష్టలను బజారుకెక్కాయని గుర్తించి సునీతారెడ్డి, మల్లిఖార్జున రెడ్డిలను సస్సెండ్ చేశారు. ఇదిలా ఉంటే సోమవారం సునీతారెడ్డి మొదటి వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు వెలుగులోనికి వచ్చాయి. ఓ యాంకర్ సోదరుడైన లెనిన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సునీత దాదాపు పదేళ్ల క్రితం వివాహం చేసుకుందనే విషయానికి సంబంధించిన ఫొటోలు బయటపడ్డాయి.

ఈ ఫొటోలు చూసి తాను షాక్‌కు గురయ్యానని, అసలు ఆ ఫొటోలు నిజమైనవో కాదో తేలాల్సి ఉందని, సునీతకు తనకన్నా ముందే మరో వివాహమైన విషయం తనకు తెలియదని ఆమె భర్త సురేందర్ రెడ్డి అన్నారు.

Related Posts