వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర చివరి ఘట్టానికి చేరుకుంది. 12 జిల్లాలను పూర్తి చేసుకుని... చివరి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. వీరఘట్టం మండలం కెల్ల వద్ద అశేష జనసందోహం మధ్య జగన్ శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.