ప్రముఖ సినీ నటి సుమలత భర్త, కన్నడ నటుడు అంబరీష్ (66) మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1991లో సినీ నటి సుమలతను వివాహం చేసుకున్నారు. 2013లో కాంగ్రెస్ తరపున కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అంబరీష్ మృతితో కన్నడ చిత్రపరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.