కృష్ణా జిల్లా నడకుదురు- చల్లపల్లి ఐదు కిలోమీటర్ల రోడ్డు. ఈ మధ్యకాలంలో కరకట్ట ఎక్ష్ప్రెస్స్ బస్సులు, లారీలు ట్రాక్టర్లు ఇలా అనేక వాహనాలు ఈ రోడ్డు మీదుగా వెళ్ళటంతో రోడ్డు పూర్తిగా పాడైపోయింది.
రోడ్డు పక్క లు గుంటలు పడిపోయినాయి. ట్రాఫిక్ జామ్లు ఎక్కువవుతున్నాయి. ఒక కిలోమీటరు రోడ్డు వెడల్పు చేశారు. మిగిలిన నాలుగు కిలోమీటర్లు రోడ్డు వెడల్పు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ నుండి చెరుకు సీజను మొదలవుతుంది ఈ ప్రాంతం నుండి రమారమి లక్షనర్ర కు పైగా చెరుకు లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీ వెళ్తుంది. అప్పుడు ఈ రోడ్డు మీద ఎక్కువ చెరుకు బళ్ళు వెళతాయి. ప్రస్తుతం ఈ రోడ్డు బాగా పాడైపోయింది. రైతులు, వాహనదారులు, గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున త్వరగా ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసి వాహనదారు;ఆకూ సహాయం చేయాలి.