YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో 40 మంది సిట్టింగ్ స్థానాలు గల్లంతు

ఏపీలో 40 మంది సిట్టింగ్  స్థానాలు గల్లంతు
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలన్నీ స్పీడు పెంచేశాయి. ఏపీలో 2019 జరగబోయే ఎన్నికలు అటు అధికార పక్షానికి.. ఇటు వైసీపీ, బీజేపీ, జనసేనలకు ప్రతిష్టాత్మకమైనవి. ఈ ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండో సారి అధికార పీఠం దక్కించుకోవాలని టీడీపీ, తొలిసారి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్, పవన్.. ఏపీలో బలపడాలని బీజేపీ భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా అన్ని పార్టీలు ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి. అలాగే గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి పని చేసిన టీడీపీ.. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతుంది. ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు బాగా ముఖ్యమైనవి. అందుకే ఆ పార్టీ మిగతా పార్టీల కంటే భిన్నంగా ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికపై బాగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారాయన.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు చంద్రబాబు ఎప్పి నుంచో కసరత్తులు చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించిన ఆయన.. తాజాగా ఐవీఆర్ఎస్ ద్వారా మరో సర్వేకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు ఫోన్ చేసి టీడీపీ ఎమ్మెల్యేలపై వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మీ ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా వున్నారా ? ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా.. ? వీటిపై మీ అభిప్రాయాలు చెప్పండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా వాయిస్‌ ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే ఈ ప్రాసెస్ జరుగుతోందని, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ సర్వే ఫలితాల ఆధారంగా టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి టీడీపీ అధినేత వచ్చే ఎన్నికల్లో దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చేస్తున్న ఈ సర్వే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

Related Posts