- వాళ్లు కూడానా.. పవన్ కళ్యాణ్‌పై కేఈ తీవ్రవ్యాఖ్యలు
- బడ్జెట్‌పై స్పందించేందుకు కేంద్రమంత్రి అశోక్ నిరాకరణ
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై టీడీపీ నేతలు అందరూ తీవ్రంగా మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపధ్యం లో టిడిపి నేత అశోక్ గజపతి రాజు సోమవారం విజయనగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. బడ్జెట్ పైన స్పందించబోనని, దానిపై మాట్లాడడానికి ఇది సరైన సందర్భం కాదన్నారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర,రాష్ట్ర కమిటీలు కూడా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. ఓ విధంగా ఆయన సొంత పార్టీ నేతలకు షాకిచ్చారు. ఇదే సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన అయ్యబా ఘాటుగానే స్పందించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల రద్దు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి తానే సలహా ఇచ్చానని అశోక్ తెలిపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతల ఆరోపణలు అసత్యమన్నారు. బడ్జెట్ పైన మార్చి 31వ తేదీ వరకు వేచి చూడాలన్నారు. కేంద్రమంత్రులు రాజీనామా చేయాలన్న వైసీపీ చేస్తున్న డిమాండును ఆయన తప్పుపట్టారు. తాము ప్రజల భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుంటామన్నారు. చేతనయితే చేస్తామని, లేదంటే ఇంట్లో కూర్చుంటామని, కానీ అవినీతికి ఆస్కారం ఇవ్వమని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఇది ఇదిలా ఉండగా .. తాము అసంతృప్తితో ఉన్నామని, వచ్చే నెల 5 వరకు వేచి చూస్తామని, తమ సహనాన్ని ఇంకా పరీక్షించవద్దని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బీజేపీని హెచ్చరించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం జాతీయ అంశంగా మారిందని, తమకు న్యాయం చేయాల్సిందే ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నిధుల లెక్కలపై కమిటీ ఏర్పాటు చేస్తామన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేఈ తీవ్రంగా స్పందించారు. సా