YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పంచ నదుల అనుసంధానమే లక్ష్యం టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రాబాబు

పంచ నదుల అనుసంధానమే లక్ష్యం  టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రాబాబు
నీరు-ప్రగతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే గోదావరి-కృష్ణా నదులను తమ ప్రభుత్వం అనుసంధానం చేసిందని గుర్తుచేశారు. పంచనదుల మహా సంగమమే మన లక్ష్యమని అన్నారు. అనంతపురం జిల్లాలో సూక్ష్మ సేద్యంతో అద్భుతాలు సాధిస్తున్నాం. సూక్ష్మ నీటిపారుదలతో ఉత్పాదకత 29శాతం పెరిగిందన్నారు.  ప్రపంచం వినూత్న ఆవిష్కరణల వైపు చూస్తోందన్నారు. బయో మెట్రిక్ ద్వారా పారదర్శకంగా పథకాల అమలు చేయాలని అధికారులకు సూచించారు. 
నవంబర్ నెల చివరలో, డిసెంబర్ మొదట్లో వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. రబీలో సీమ జిల్లాలు, ప్రకాశంలో పంటల విస్తీర్ణం పెరిగిందని, నాణ్యమైన పైర్లు, ఆరోగ్య జీవనానికి ఏపీ చిరునామా కావాలని తెలిపారు. కత్తెర తెగులు సోకకుండా జొన్న, మొక్కజొన్నను కాపాడాలన్నారు. ఎప్పటికప్పుడు రైతులను చైతన్యపరచాలని సీఎం ఆదేశించారు. నాణ్యమైన పైర్లు, ఆరోగ్యకరమైన జీవన అలవాట్లకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ గా మారాలని ముఖ్యమంత్రిఅన్నారు. గోకులం, మినీ గోకులాలను సద్వినియోగం చేసుకోవాలని, పశు గణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందున్నామని, టెక్నాలజీలో ఏపీనే ముందుందని చెప్పారు. ఈజ్ ఆఫ్ లివింగ్ లో కూడా తామే ముందుండాలని ఆకాంక్షించారు. నరేగాలో గత ఏడాది లక్ష్యం పూర్తిచేశామని, రూ.10వేల కోట్ల నరేగా లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. ఆదరణ-2 పనిముట్లు వెంటనే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రమంతటా ఆర్టీజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

Related Posts