YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

వెంటనే ఎన్నారై పాలసీని వెంటనే ప్రకటించాలి - టీపీసీసీ ఎన్నారై సెల్

 వెంటనే ఎన్నారై పాలసీని  వెంటనే ప్రకటించాలి - టీపీసీసీ ఎన్నారై సెల్

నాలుగేళ్లు కావస్తున్నా  ప్రభుత్వం ఎన్నారై పాలసీ పై  నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని 2014 ఎన్నికల మేనిఫెస్టో లో  సగం పేజీ ఎన్నారై  పాలసీ పై అరచేతి లో వైకుంఠాన్ని చూపి నేడు ఎన్నారై లను పట్టించుకుంట లేదని టీపీసీసీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ అన్నారు 2016 జులై లో అట్టహాసంగా ,విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి  ఎన్నారై పాలసీ పై ఆశలు రేకెత్తించి  2 ఏండ్ల వరకు కోల్డ్  స్టోరేజ్ లో పడేశారు . గల్ఫ్ నుండి ఏడాదికి 500 మంది చనిపోయి వారి పార్థివ దేహాలు తీసుకువస్తే  తెల్లకార్డు పేరున అవస్థ లకు గురి చేస్తున్నారు.టీపీసీసీ అడ్వైసరి మెంబెర్ గంగసాని ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ   ఎన్నారై మంత్రి  రామారావు   తెలంగాణ సాకారం చేసిన కాంగ్రెస్ ను  లోఫర్  అనడం  ఖండిస్తూ  నాలుగేళ్లు  ఐన ఎన్నారై పాలసీ ప్రకటించకుండా విదేశీ పర్యటనలు చేస్తున్న  మంత్రి కేటీర్  జోకర్ అని విమర్శించారు . ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్  కార్యదర్శి ,టీపీసీసీ ఎన్నారై సెల్ ,కన్వీనర్ గంప వేణుగోపాల్  మాట్లాడుతూ   వలస బాధితులు ఏజంట్ ల చేతి లో మోస పోవడాన్ని అరికట్టడం లో  ప్రభుత్వం విఫలం అయిందని , ఎన్నారై సంక్షేమం పై  చిత్తశుద్ధి లేదని  అన్నారు 

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎన్నారై సెల్  కో కన్వీనర్  సుధాకర్ గాడ్ మాట్లాడుతూ   పార్లమెంట్ లో తెలంగాణ ప్రక్రియ పై   పార్లమెంట్ ను అవమానకరం మాట్లాడిన ప్రధాని మోడీ ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలిసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ను విమర్శించడం  తగదని అన్నారు , దళితులకు అధికారం పేరున గద్దెనెక్కి మోసం చేసిన కేటీర్  మీ కుటుంబమే లోహఫ్ అని అన్నారు ,బిసి  లకు రాజ్యాధికారం అందకుండా ,ఉన్నత స్థాయి కి వెళ్లకుండా గోర్లు ,బర్లు అని అనడం కుట్ర లో భాగమే నాని  ఎద్దేవా చేశారు. ఎన్నారై సెల్  కో కన్వీనర్  చిట్టెం అచ్యుత రెడ్డి  మాట్లాడుతూ   ఎన్నారై పాలసీ ప్రకటించక పోవడం  వాళ్ళ గల్ఫ్ ఎన్నారై లు ఎన్నో అవస్థలు పడుతున్నారని   నారాయణ పేట కు సంబంధించి  గల్ఫ్ ఎన్నారై సౌదీ లో చనిపోయి  15 రోజులు ఐన    పార్దీవ దేహాన్ని తీసుకురావడం లో  ప్రభుత్వం చొరవ తీసుకుంటాలేదని విమర్శించారు . కోర్ సభ్యులు  బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ   ఎన్నారై మంత్రి కేటీర్    ట్విట్టర్ పిట్ట   కబుర్లు అపి ఎన్నారై పాలసీ ప్రకటించి  గల్ఫ్ ఎన్నారైలకు న్యాయం చేయాలని  అన్నారు కోర్ సభ్యులు జాన్సర్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ   ఎన్నారై మంత్రి   కేటీర్  విదేశీ పర్యటన పై శ్వేత పత్రం సమర్పించాలని డిమాండ్ చేసారు 

Related Posts