YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లారీ ఎక్కిన విమానం.. -నెల్లూరు జాతీయ రహదారిపై కనువిందు

లారీ ఎక్కిన విమానం..  -నెల్లూరు జాతీయ రహదారిపై కనువిందు
నెల్లూరు జాతీయ రహదారిపై విమానం లారీ ఎక్కి ప్రయాణం చేయడం చూపరులను ఆకట్టుకుంది.   సోమవారం ఆ విమానం, వాహన చోదకులను, స్థానికులను కనువిందు చేసింది.  మరమ్మత్తులకు గురైన ఆ విమానాన్ని చెన్నై నుండి విశాఖకు ట్రాలీ ద్వారా జాతీయ రహదారిపై తరలించారు.  లారీ ద్వారా తరలిస్తున్న ఈ విమానంకు వెనుక భాగం, ముందు భాగంగ దెబ్బతిని ఉన్నాయి.  
రెండు ప్రక్కల రెక్కలు కూడా లేవు. తడ నుండి కావలి వరకూ ఉన్న 16వ జాతీయ రహదారిపై వెళ్లే వారు ఈ విమానాన్ని ఆసక్తిగా తిలకించారు. అక్కడక్కడా లారీ ఆగిన సమయాల్లో కొందరు దాని వద్దకెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు.

Related Posts