దవళేశ్వరం కట్టేటప్పుడు మనం లేము... శ్రీశైలం ఆనకట్ట కట్టేటప్పుడు మనం లేము... బెజవాడ ప్రకాశం బేరేజ్ కట్టేటప్పుడు మమనం లేము.. కానీ పట్టిసీమ, పోలవరం, అమరావతి, ఇవి కట్టేటప్పుడు మమనం ఉన్నాము.. అద్భుతాలు ఆవిష్కిరాం జరుగుతూ ఉంటే, మనం కాళ్ళ ముందే చూస్తున్నాం... సర్ధుడైన నాయకుడు వుంటే ఎంత క్లిష్టమైన పనైనా సాధ్యం అని నిరూపిస్తున్నారు.. ఈ రాష్ట్రానికి చెంద్రబాబు ఎందుకు అవసరమో పోలవరం పరుగులే ఒక ఉదాహరణ ... నవ్యాంధ్ర జల, జీవ నాడి పోలవరం ప్రాజెక్టు కొత్త రికార్డు సృష్టించింది.కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. 24 గంటల్లో 11వేల 289 క్యూబిక్ మీటర్ల పనిని పూర్తి చేసింది. గతంలో ఒకే రోజులో 11వేల 158 క్యూబిక్ మీటర్లు చేసిన జాతీయ రికార్డును నవయుగ కంపెనీ అధిగమించింది. ఇదే స్పూర్తితో త్వరలో త్రీగోర్జెస్ డ్యామ్ రికార్డునూ అధిగమిస్తామని ‘నవయుగ’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. పోలవరం కాంక్రీటు పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో... రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, పాత ధరలకే ఈ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే పోలవరం కాంక్రీటు పనులు పరుగులు తీయడం మొదలైంది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7300 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. అయితే ఈ రికార్డు ని జూన్ నెలలోనే పోలవరం అధిగమించింది. కేవలం 16 గంటల్లో 8వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేసి జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టింది. అయితే తన రికార్డును తానే, మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు అధిగమించింది. చైనాలోని త్రీగోర్జె్‌సలో 24 గంటల్లో 13వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేశారు. ఇదే స్థాయిలో కాంక్రీట్ పనులు కొనసాగిస్తే పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తవుతుందని, ప్రపంచ రికార్డు కూడా బద్దలవుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు.