సిద్దిపేట నియోజక వర్గంలోని నంగునూరు మండల పరిధిలోని గ్రాకొండంరాజుపల్లి గ్రామం లో మంగళవారం ఉదయం టిఆర్ ఎస్ మండల నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు ను లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్న నాయకులు కోరారు. హరీష్ రావు అండదండలతో వాగుఅవతలి గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి ని సాధించాయన్నారు. త్వరలోనే అన్ని గ్రామాలకు సాగునీరు వస్తుందన్నారు. ప్రచార కార్యక్రమంలో ఎంపిపి శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు వేముల వెంకట్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, కోమాండ్ల రాంచంద్రారెడ్డి, దువ్వల మల్లయ్య, బద్దిపడగ కిష్డారెడ్డి, కోల రమేశ్ గౌడ్,పార్టీ మండల శాఖ అధ్యక్షులు లింగంగౌడ్, సీనియర్ నాయకులు సంగుపురేందర్, కూతురు రాజిరెడ్డి, నిమ్మ మల్లారెడ్డి, కరెడ్ల లక్ష్మారెడ్డి, బెదురు తిరుపతి, తుంగకనకయ్య, రవీంద్రాచారీ, మైనార్టీ నాయకులు రహీమ్, అజీజ్, మాధవారెడ్డి, రాజిరెడ్డి, నార్లపురం రామ్మోహన్, జయపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,బిక్షపతి నాయక్, రవీందర్ రెడ్డి, రంగు రాజుగౌడ్, సతీష్ గౌడ్, పర్శరాములు, రాము, నాగేంద్రం, సిద్దు తదితరులు పాల్గొన్నారు.