YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

హోదా కోసం ఉద్యమ బాట

హోదా కోసం ఉద్యమ బాట

-  'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీ మాకొద్దు'

- మార్చి 1న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు

-  మార్చి 5న ఢిల్లీలో జంతర్‌మంతర్‌  వద్ద ధర్నా

- పోరాటానికి సై అంటున్న వైఎస్సార్ సీపీ 

 'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీ మాకొద్దు' అనే నినాదంతో పోరాటానికి వైసీపీ సిద్దమైంది. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి బస చేసిన శిబిరం లో సోమవారం రాత్రి నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎంపిలు, ఎంఎల్ఎలు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 

కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ మార్చి 1న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, మార్చి 5న ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రానికి హోదా సాధించే వరకు విశ్రమించేది లేదని.. అవసరమైతే ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు సిద్దమైంది వైసీపీ.

'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీతో మోసపోవద్దు' అనే నినాదంతో పోరుబాటకు సిద్దమవుతున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను నిరాకరించడం.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించకపోవడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయంపై వైసీపీ నేతలతో జగన్‌ సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు.

అందులోని అంశాలు - మార్చి 1న అన్ని కలెక్టరేట్ల ముందు పార్టీ కార్యకర్తలు, సమన్వయకర్తలు అందరూ కలిసి ధర్నా చేయాలని నిర్ణయం. 

- ప్రత్యేక హోదా మన హక్కు ప్యాకేజీతో మోసపోవద్దు అనే నినాదం.

- మార్చి 5న ప్రత్యేక హోదా మన హక్కు. ప్యాకేజీ మాకొద్దు..అంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ధర్నా.

- మార్చి 3న పార్టీ కీలక నేతలందరూ ఢిల్లీ పర్యటన...పర్యటనను వైయస్ జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. 

- ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని, గత మూడేళ్లుగా  వైయస్ జగన్ నాయకత్వంలో పోరాడుతున్నామన్నారు. గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ధర్నా చేయడమే కాకుండా అరెస్ట్ కూడా అయిన సంగతిని గుర్తు చేశారు.

- అనేకసార్లు  జగన్ ఆమరణ దీక్షలు చేశారని, యువభేరీ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక హోదా లాభాలను ప్రతి ఒక్కరికీ వివరించారన్నారు. 

- ప్రత్యేక హోదా కోసంవైయస్ జగన్ పిలుపుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు బంద్ లు నిర్వహించటం జరిగిందన్నారు.

- ప్రత్యేక హోదా మాత్రమే సంజీవని ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోంది. ఈ  ఆందోళనలు పోరాటాలు ప్రజల మన్ననలు పొందాయని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

- ప్రత్యేక హోదా మన హక్కు. ప్యాకేజీతో మోసపోవద్దని నినాదాలతో పోరాటాలకు శ్రీకారం చుట్టిందని స్పష్టం చేసిన భూమన. 

- ప్రజల దీనావస్థలు చూసి వారికి భరోసా కల్పిస్తూ..  వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. 

- మార్చి 3న పార్టీ నేతలు అందరూ వైయస్ జగన్ ను కలుస్తారని వివరించారు. 

వంచిస్తున్న చంద్రబాబు

- ప్రత్యేక హోదాతో మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధిస్తాయి. 

- ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక హోదా ముద్దు. వద్దని మరో రోజు. సంజీవని ఒక రో జు.. సంజీవనా అని మరో రోజు. ప్యాకేజీతో హోదా కన్నా ప్రయోజనాలు వచ్చాయని కల్లబొల్లి కబుర్లు చెబుతూ చంద్రబాబు ప్రజల్ని వంచిస్తున్నారు. 

- ప్రత్యేక హోదాను సాధించే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని భూమన తెలిపారు. 

- పోరాటం ఫలితాల కోసమే చేస్తాం. ప్రభుత్వం మీద ప్రభుత్వాలు చేస్తున్న మోసాల మీద తిరగబడటం ప్రజాస్వామ్య లక్షణం. పేద ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలన్న లక్ష్యం ప్రతిపక్ష నేత జగన్ కు  ఉంది. 

- ఎక్కడైతే శ్రీ వేంకటేశ్వరుని పాదాల సాక్షిగా 15 సంవత్సరాలు హోదా ఇస్తామంటూ.ప్రకటించారో అక్కడే. ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచారని అన్నారు. 

-ఉద్యమాలు, ఆందోళనలకు  ఫలితం రానటువంటి పరిస్థితుల్లో మా పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని  వైయస్ జగన్ స్పష్టం చేశారన్నారు.

దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ. వచ్చే నెల 1వ తేదీన 'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీతో మోసపోవద్దు' అనే నినాదంతో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అలాగే మార్చి 5న "ప్రత్యేక హోదా మన హక్కు - ప్యాకేజీ వద్దు' అనే నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, నేతలతో ధర్నా చేయాలని నిర్ణయించామన్నారు. మార్చి 3న జగన్‌ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్రమించబోదన్నారు భూమన. తమ ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే తమ ఎంపీలు ఖచ్చితంగా రాజీనామా చేస్తారన్నారు భూమన. వైసీపీపై అభాండాలు వేసేందుకు టీడీపీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉందన్నారు. టీడీపీ వైఖరిని ప్రజలందరూ చూస్తున్నారని.. దీనికి సరైన సమయంలో సరైన సమాధానం చెబుతుందన్నారు. మొత్తానికి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. మరి వైసీపీ పోరాటంతో కేంద్రం ఏ మేరకు దిగివస్తుందో చూడాలి !

Related Posts