YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

2019పైనే గురి..

2019పైనే గురి..
రాజకీయ చాణక్యుడిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కొందరు అభివర్ణిస్తారు. 40ఏళ్ల పొలిటికల్ ఎక్స్ పీరియన్స్ తో ఆయన అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కూడా ఇదే సిట్యువేషన్ లో ఉన్నారు. బీజేపీతో ఈక్వేషన్ సరిగా లేకపోవడంతో చంద్రబాబు.. ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలన్న కసితో ఉన్నారు. 2019లో బీజేపీని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా పలు పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే కార్యక్రమం సాగిస్తున్నారు. ఆయన ప్రతిపాదనకు సుమారు 18పార్టీలు సుముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కూడా చంద్రబాబు ప్రపోజల్ కు ఓకే చెప్పేసింది. దీనిపై మరింత కసరత్తు జరగాలని చెప్పుకొచ్చింది. టీడీపీ ఎన్డీయే నుంచి బయటికొచ్చాక బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయాలనే ప్రయత్నం చాలాకాలం నుంచి చేస్తోంది. ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడికి లేని పరిచయాలు, జాతీయ రాజకీయాల్లో పాత్ర, అనుభవం చంద్రబాబుకు కలిసి వచ్చే అంశం. కేసీఆర్‌ కూడా గతంలో థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్‌ అని ప్రయత్నించినా ఆచరణలోకి రాలేదు. చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరినైనా కలుపుకొంటాం.. కాంగ్రెస్‌నైనా కలుపుకొని పోతామని చెప్పడం వల్ల ఆయనతో ఎక్కువ మంది కలిసి వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదేమంత తేలిగ్గా సాకారమయ్యే పనికాదు. 
దేశంలో  బీజేపీతోనైనా, కాంగ్రెస్‌తోనైనా ఉండాలనుకునే పార్టీలే ఎక్కువ. ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఉండాలనుకునే లోకల్ పార్టీలు చాలా తక్కువ. దీంతో చంద్రబాబు ప్రయత్నాలు ఇప్పటికప్పుడు సక్సస్ అవుతాయని చెప్పలేని పరిస్థితి ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో 25 పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ప్రధాని పదవికి పోటీదారుడుగా ఇతర పార్టీలు చంద్రబాబును భావించే అవకాశం లేదు. యూపీలో 80 పార్లమెంట్‌ సీట్లు ఉన్నాయి. పశ్చిమ్‌బంగాలో 42 సీట్లు ఉన్నాయి. అందువల్ల మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, మమతా బెనర్జీలు ఆయన పోటీదారుడని భావించరు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఈ పాత్ర పోషించడంలో కలిసొచ్చే వాళ్లు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు మాయావతి, మమతా బెనర్జీతో మాట్లాడారు. బీజేపీయేతర పార్టీలను ఒకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తారు. భవిష్యత్తులో కూడా ఇది మరింత ఊపందుకొనే అవకాశాలే అధికం. కానీ బీజేపీ లాంటి బలమైన పార్టీని నిలువరించాలంటే.. చంద్రబాబుకు అంత ఈజీ కాదని విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Related Posts