అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు షాక్ తగిలింది. శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. 2014 ఎన్నికల్లో ఆయనపై పోటీచేసిన వైసీపీకి చెందిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆదేశించింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరన్న దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. మంగళవారం ఈ తీర్పును వెల్లడించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వీరన్న.. వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్ తిప్పేస్వామి పోటీ చేశారు. కాని తిప్పేస్వామిపై 14వేలపై చిలుకు ఓట్లతో గెలిచారు. అయితే ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో.. తనపై కర్ణాటకలో నమోదైన క్రిమినల్ కేసులు.. తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. దీంతో తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈరన్న ఎన్నిక చెల్లదని సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణ జరుపుతోంది. మంగళవారం జరిగిన హియరింగ్‌లో ఈరన్న ఎన్నిక చెల్లదేని తేల్చి.. తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యేగా తిప్పేస్వామి కొనసాగాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై ఈరన్న అప్పీల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.