కృష్ణా జిల్లా దివి సీమలో, APSIDC క్రింద పులిగడ్డ అవనిగడ్డ, బందలాయి చెరువు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయి. వీటికి ఏడు గంటలు మాత్రమే రోజుకి పవర్ సప్లై ఇవ్వటం వలన, పూర్తిస్థాయిలో సాగునీరు దిగువ ప్రాంతాలకు అందటం లేదు. ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ల కు 24 X 7 కరెంటు సప్లై సదుపాయం కలి గ చేసినట్లయితే, కాలువ శివారు ప్రాంతాలకు కూడా సాగునీరు అందచేయటానికి అవకాశం కలుగుతుంది. ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు 75HP అంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉన్న వి. రూల్ ప్రకారము 16 గంటల వరకు వీటికి సపరేట్ లైన్ వేసుకోవడం ద్వారా కరెంట్ సప్లై ఇవ్వడానికి అవకాశం ఉందట.ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ల కింద చాలా ఆయకట్టు (ముఖ్యంగా కూరగాయ పంటలు పండే)ఉంది. ఒకసారి ఈ మూడు LIS లకు 16 గంటల విద్యుత్ సరఫరా ఇచ్చే ప్రతిపాదనను పరిశీలించి తగు సహాయం చేయగలరు.