YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

శివరాత్రి నిర్ణయం సులువుగా చేయడం ఎలా..?

శివరాత్రి నిర్ణయం సులువుగా చేయడం ఎలా..?

ఈ సారి శివరాత్రి 13వతేదీన అని పూర్వపద్ధతి పంచాంగాలు, 14 వతేదీ అని దృక్సిద్ధ పంచాంగాలు నిర్ణయించాయి. అసలు శివరాత్రి నిర్ణయం ఎలా సులువుగా చేయాలో చూద్దాం. నేను పరిశీలించిన ధర్మశాస్త్ర గ్రంథాలు ఏమిటంటే -
1.వ్రతనిర్ణయ కల్పవల్లి.
2. ధర్మసింధు
3.నిర్ణయసింధు
4.స్మృతి కౌస్తుభం
5. కాలతత్వవివేచనం.
6. కాలసారం
7. కాలమాధవం.
8. హేమాద్రి.
9.కాలదీపం
10.కామికాగమం
11.వర్షక్రియా కౌముది.
12. పురుషార్థచింతామణి.

పై గ్రంథాలు #శివరాత్రనిర్ణయం పై ఏమి చెప్పాయో చూస్తే ప్రదోషవ్యాప్తి,నిశీథ వ్యాప్తి రెండూ అవసరమే అని అవగతమవుతుంది. అయితే ఏది ఎక్కువ? అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. #కాలమాధవం మరియు #కాలసారం అనే రెండు గ్రంథాలూ చాలా సులువుమార్గాలని ఉపదేశించాయి. దీనిపై #మాధవాచార్యులు ఎంతో తార్కికంగా చర్చించి #కాలమాధవం లో ఇలా తేల్చారు.

"అత్రాయం వివేకః సంపన్నః . దినద్వయే నిశీథవ్యాప్తౌ  తదవ్యాప్తౌచ ప్రదోషవ్యాప్తిర్నియామికా. తథా దినద్వయేపి ప్రదోషవ్యాప్తౌ తదవ్యాప్తౌచ నిశీథవ్యాప్తిర్నియామికా. ఏకైకస్మిన్ దినే ఏకైకవ్యాప్తౌ జయాయోగో నియామక ఇతి."

దీనినుండి మనం ఒక గణితసూత్రాన్ని (Mathematical Formula) తయారుచేయవచ్చు.

మాఘబహుళ చతుర్దశి నాడు శివరాత్రి నిర్ణయం చేస్తాంకదా ! అయితే ఆ చతుర్దశి ని పరిశీలించండి.

1.చతుర్దశి ప్రదోషకాలానికి ఉంటే 1పాయింట్ ఇవ్వండి.
2. చతుర్దశి నిశీథకాలానికి కూడా ఉంటే 2 పాయింట్లు ఇవ్వండి. 

పై విషయం గుర్తు ఉంచుకుని , చతుర్దశి రెండురోజులు వస్తే ఏరోజు ఎక్కువ పాయింట్లు వస్తే ఆ రోజే శివరాత్రి అని నిర్ణయం చేయండి. ఈ గణితసూత్రం అన్ని ధర్మశాస్త్ర గ్రంథాలనూ సమాధానపరుస్తుంది.
ఉదాహరణకు ఈ సంవత్సరం పరిశీలిద్దాం.

1. #పూర్వపద్ధతి పంచాంగాలు పరిశీలిస్తే
13ఫిబ్రవరి, మంగళవారం నాడు త్రయోదశి రాత్రి 10గం34ని.
14ఫిబ్రవరి, బుధవారం చతుర్దశి రాత్రి 12గం28ని.
ఇక్కడ 13తేదీ నిశీథానికి ఉంది , ప్రదోషానికి లేదు. అందువలన పాయింట్లు 0+2=2.
14వతేదీన ప్రదోషానికి, నిశీథానికీ ఉన్నది.
అందువల్ల 1+2=3.
14వతేదీన ఎక్కువ పాయింట్లు కాబట్టి వీరిగణితం ప్రకారం14నే శివరాత్రి వ్రాయాలి. కానీ 13న వ్రాసారు. ఇది ధర్మశాస్త్ర విరుద్ధం.

2.చైత్రపక్ష లేక గవర్నమెంటు పంచాంగాలు. 13న త్రయోదశి రాత్రి .10గం.34ని.
14న చతుర్దశి రాత్రి 12గం.46ని.లు.
13న పాయింట్లు 0+2=2

14న పాయింట్లు 1+2=3.
కావున వీరి గణితం ప్రకారం 14న శివరాత్రి వ్రాయాలి. అలాగే వ్రాసారు.

3.సూర్యసిద్ధాంతరీత్యా సంస్కృతాయనాంశల పంచాంగం. (మధురవారు మరియు కపిలేశ్వరపురం తంగిరాలవార
13న త్రయోదశి రా.గం. 12.30.
14న చతుర్దశి రా.గం.2.43.
13న పాయింట్లు 0+0=0
14న పాయింట్లు 1+2=3
కావున వీరిగణితం ప్రకారం 14వతేదీనే శివరాత్రి వ్రాయాలి. అలాగే వ్రాసారు.

#చివరికి తేల్చినదేమంటే  ఏపంచాంగం ని అనుసరించేవారికైనా 14, బుధవారమే శివరాత్రి.
పై ఫార్ములా ప్రకారం ఏ సంవత్సరమైనా సరే సులువుగా నిర్ణయించవచ్చునని తెలియజేయడమైనది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related Posts