తెలంగాణలో తనకు తిరుగులేదు అనుకున్నారు కేసీఆర్. తమకు ప్రత్యర్థులే లేరనే ధీమాతో ముందస్తుగానే ఎన్నికల నగారా మోగించాడు. నిర్ణీత గడువుకు ముందే అసెంబ్లీ రద్దు చేసి సంచలనం సృష్టించాడు. కానీ ఆయన అనుకున్నట్లుగా లేదు పరిస్థితి. చంద్రబాబు చొరవతో పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఆవిర్భవించి కేసీఆర్‌కి కొరకరాని కొయ్యలా తయారయ్యాయి. గులాబీ బాస్ ఎత్తుగడలను చిత్తు చేస్తూ ప్రజాభిమానం పొందుతున్నాయి.అసలు చంద్రబాబు పేరే తెలంగాణలోని ప్రజల నోటివెంట రాదనుకున్న కేసీఆర్‌కి దిమ్మతిరిగే షాకులిస్తూ మహాకూటమిలో కీలక భూమిక పోషిస్తున్నారు చంద్రబాబు. టీడీపీ పోటీ చేస్తున్నది తక్కువ స్థానాలే అయినప్పటికీ బాబు దూసుకుపోతున్న తీరు చూసి దిక్కుతోచని స్థితిలో పడ్డారు కేసీఆర్ మరియు గులాబీ దళం. అందుకే కాబోలు ఒక్కొక్కరుగా కీలక నేతలంతా గుబాలీ కండువాను పక్కన పెట్టి మహాకూటమి గడప తొక్కుతున్నారు.మహాకూటమి సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు చూపిన చాణక్యం, సీమాంధ్ర ఓటర్లను మహా కూటమి వైపు మళ్లించేంఫుకు ఆయన చేస్తున్న వ్యూహాలు చూసి ఉక్కిరిబిక్కరి అవుతున్నారట కేసీఆర్ సహా టీఆర్‌ఎస్ నేతలంతా! దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకులను ఏకం చేయటంలో చంద్రబాబు చేస్తోన్న కృషి, ఆయనకున్న పలుకుబడిని చూసిన రాహుల్ కూడా చంద్రబాబు చెప్పినట్లే నడుచుకొనేందుకు సిద్ధపడడం కేసీఆర్‌ని మరింత కలవరపెడుతోంది! అంతేకాదు కూకట్‌పల్లి నుంచి ఎంతో తెలివిగా నందమూరి వారసురాలు సుహాసినిని బరిలోకి దింపటం.. చంద్రబాబు చాణక్యానికి నిదర్శనం అనే టాక్ వినిపిస్తోంది. ఇక మరీ ముఖ్యంగా.. గ్రేటర్ సిటీ పరిధిలో చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తారన్న ప్రచారం కేసీఆర్ కి వణుకుపుట్టిస్తోందని సమాచారం.అందుకేనేమో కేసీఆర్.. ఇచ్చే స్పీచుల్లో కాస్త భయం కనిపిస్తోందని అంటున్నారు జనం. అమరావతిలో మన జుట్టు పెడటమా అని జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం చూస్తుంటే.. కేసీఆర్‌కి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా తెలుస్తుందనేది రాజకీయ విశ్లేషకుల మాట.