సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అమీ జాక్సన్ హీరోయిన్ గా అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన చిత్రం ‘2.0’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. మరో 24 గంటల్లో రిలీజ్ అవుతున్న చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం అందరు ఎంతో ఇష్టంగా ప్రేమించే మొబైల్ ఫోన్స్.. టవర్స్..ఇందులో నెగటివ్ గా చూపిస్తున్నారని టెలికం ఆపరేటర్లు సెల్యూలార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇది రాజ్యంగం ప్రసాదించిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఈనెల 23న ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. మొబైల్ ఫోన్లు, మొబైల్ టవర్లు నుండి ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్ ఉద్గారాలు వాటి నుంచి వెలువడతాయి అని ఈసినిమాలో చూపిస్తున్నారని వారు చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా అపవాదు మాత్రమే తప్ప మరోటి కాదని పేర్కొంది 2.0 టీం. సీబీఎఫ్‌సీకి, కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చే వరకు సినిమా విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తుంది. అయితే సీబీఎఫ్‌సీ.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాట నిజమేనని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ పేర్కొన్నారు.పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇటువంటి ఆరోపణలు కామనే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమస్య సినిమా రిలీజ్ ను అడ్డుకుంటదా అని సినీ ప్రేక్షకులు ఆందోళనతో ఉన్నారు. అంత రెడీ అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ సమస్య ఏంటో ఎవరికి అర్ధం కావట్లేదు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మరి దీన్ని శంకర్ ఎలా డీల్ చేస్తాడో