తిరుమల శ్రీవారిని బుధవారం ఇస్రో చైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పీఎస్ఎల్వి సి43 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పిలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేశారు. ఈ రోజు ఉదయం 5 గంటల 58 నిమిషాలకు పీఎస్ఎల్వి-సి43 కౌండౌన్ మొదలయిందని, గురువారం ఉదయం 9 గంటల 58 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దోసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ కే శివన్ అన్నారు. మన దేశానికి చెందిన హైసిస్ ఉపగ్రహంతో... పాటు యూఎస్ కు చెందిన 23 సీ43 కక్ష్యలోకి మోసుకెళ్లనుందని ఆయన తెలిపారు. ఈ ఉపగ్రహం భూమిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఛాయాచిత్రాలను మనకు అందిస్తుందని శివన్ పేర్కొన్నారు.