తమిళంలో ఇటీవల విశాల్ హీరోగా వచ్చిన 'ఇరుంబు తిరై' (అభిమన్యుడు) ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మిత్రన్ దర్శకత్వం వహించారు.రీసెంట్ గా ఆయన అఖిల్ ను కలిసి ఒక లైన్ చెప్పాడట. చాలా వైవిధ్యభరితంగా అనిపించడంతో పూర్తి కథను సిద్ధం చేయమని అఖిల్ అన్నాడట. ప్రస్తుతం మిత్రన్ అదే పనిలో వున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతము అఖిల్ తన మూడవ సినిమా 'మిస్టర్ మజ్ను'ను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు.