ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలవడం తన చిరకాల స్వప్నమని భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ వెల్లడించింది. ఇటీవల ఢిల్లీ వేదికగా ముగిసిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన మేరీకోమ్.. ఆ టోర్నీలో ఆరుసార్లు విజేతగా నిలిచిన బాక్సర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఓ అథ్లెటిక్స్ ఈవెంట్‌కి హాజరైన మేరీకోమ్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవడం తన తదుపరి లక్ష్యమని వెల్లడించింది. ఒలింపిక్స్‌లో ఇప్పటికే నేను ఒక పతకం గెలిచాను (2012లో కాంస్యం). కానీ.. బంగారు పతకం గెలవడం నా కల. ఇటీవల ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ గెలుపు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రస్తుతం నా లక్ష్యం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే. దేశానికి ఆ పతకం అందించేందుకు ఎంత శ్రమకమైన నేను సిద్ధమే’ అని మేరీకోమ్ వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగంలో బాక్సింగ్ ఉండదు. కాబట్టి.. ఇటీవల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో పోటీపడిన మేరీకోమ్ 51 కేజీల విభాగంలోకి మారాల్సి ఉంటుంది.