YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొత్త రాజకీయ పార్టీ దిశగా జేడీ అడుగులు

కొత్త రాజకీయ పార్టీ దిశగా జేడీ అడుగులు
కొత్త రాజకీయ పార్టీ పెట్టాలా? సంపూర్ణ మద్దతు తెలిపిన లోక్‌సత్తాతో కలిసి వెళ్ళాలా అనే విషయంలో అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని ఐపిఎస్‌ మాజీ అధికారి వివి లక్ష్మినారాయణ చెప్పారు. జేడీ సొంత పార్టీ వైపే మొగ్గు చూపడం ఆసక్తిగా మారింది. ఆయన పార్టీ పేరు, జెండా, ఎజెండా ఎలా ఉండబోతుందనే చర్చ మొదలయ్యింది. జనధ్వని పేరుతో పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. మరి లక్ష్మీనారాయణ అదే పేరుకు మొగ్గు చూపుతారో.. మరో కొత్త పేరుతో ముందుకొస్తారో చూడాలి. నూతన ఒరవడితో రాజకీయ అరంగేట్రం చేస్తామని చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎపిలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు.రాజకీయ రంగం ప్రవేశంపై వారితో చర్చించారు. అలాగే లోక్‌సత్తా పగ్గాలు చేపట్టాలని.. ఆ పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఆహ్వానించడంతో డైలమాలో పడ్డారు. దీనిపై కూడా కార్యకర్తలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానన్న సీబీఐ మాజీ జేడీ.. వారి సూచన మేరకు చివరికి సొంత పార్టీవైపే మొగ్గు చూపారు.  రాజకీయ ఎజెండా, విధివిధానాలపై చర్చించేందుకు హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో తన మద్దతుదారులతో లక్ష్మినారాయణ సోమవారం సమావేశమయ్యారు. లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయ్రపకాశ్‌ నారాయణ, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎపి కన్వీనర్‌ పోతిన వెంకట రామారావు, తెలంగాణ ప్రజాపార్టీ అధ్యక్షులు జస్టిస్‌ చంద్రకుమార్‌, పలువురు మేధావులు లక్ష్మినారాయణకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భావసారూప్యం ఉన్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తిరుపతిలో తాను చేసిన ప్రకటన తర్వాత చాలా పార్టీలు తనను ఆహ్వానించాయి కానీ ఏ పార్టీ విధివిధానాలపై స్పందించలేదన్నారు. అయితే ఇప్పుడు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయ్రపకాశ్‌ నారాయణ లోక్‌సత్తా పగ్గాలు చేపట్టాల్సిందిగా బహిరంగంగా ప్రకటించారని అన్నారు. కోర్‌ కమిటీలో చర్చించి అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలపాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్దితో పనిచేసే వ్యక్తులకే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. తెలంగాణలో జరిగే ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని స్పష్టంచేశారు. ఎపిలో నూతన రాజకీయ ఒరవడి అత్యవసరమని లక్ష్మినారాయణ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డిపై దాడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని లక్ష్మినారాయణ స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రజల మాన ప్రాణాలు, ఆస్తులు కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. ప్రజా సమస్యలు కనుమరుగయ్యే వరకు రాజకీయాల్లో ఉంటానని, వెనక్కితగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోడీ వదిలిన బాణం లక్ష్మినారా యణ అని ప్రచారం జరుగుతుందన్న ప్రశ్నకు బదులిస్తూ, తాను బాణం కాదు.. ధనస్సునని చెప్పారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని అభిప్రాయపడ్డారు.

Related Posts