చిత్రం: 2.ఓ
నటీనటులు: రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్, సుదాంశు పాండే, అదిల్ హుస్సేన్, కళాభవన్ షాంజాన్, రియాజ్‌ఖాన్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
శంకర్ ఎప్పుడూ సామాజిక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకుని, వాటిని సాంకేతికంగా ఉన్నతంగా చూపిస్తుంటాడు. ఈసారి సాంకేతిక విషయాన్నే ఎంచుకోవడం మరింత కలిసొచ్చింది. 2.ఓ విషయంలో ఆయన సెల్‌ఫోన్‌లపై ఫోకస్ పెట్టాడు. సెల్ ఫోన్‌ల వల్ల వచ్చే శబ్దతరంగాల వల్ల ప్రకృతి ఎంత నష్టపోతోందో, భవిష్యత్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వస్తుందో... ఈ సినిమాలో కళ్లకు కట్టారు. వాటి చుట్టూ రజనీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ ఓ కథ అల్లారు. ప్రధమార్ధంలో సెల్ ఫోన్ల మాయం, పక్షిరాజు చేసే విధ్వంసం వీటిపైనే దృష్టి పెట్టారు. ఎప్పుడైతే చిట్టి రంగ ప్రవేశం చేస్తాడో.. అప్పుడు ఓ రసవత్తరమైన పోరు చూసే అవకాశం దక్కుతుంది. పక్షిరాజుగా అక్షయ్ ని చూపించడంతో విశ్రాంతి కార్డు పడుతుంది.
కథ:
తమిళనాడు దగ్గర ఓ ప్రాంతంలో ముసలి వ్యక్తి బాధపడుతూ వచ్చి సెల్‌ఫోన్ టవర్‌కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. పక్క రోజు నుండి సెల్‌ఫోన్స్ మాయమవుతూ ఉంటాయి. ఎవరి దగ్గరా సెల్‌ఫోన్సే ఉండవు అన్నీ మాయమవుతూ ఉంటాయి. విషయం అర్థం కాక సెంట్రల్ హోం మినిష్టర్ సైంటిస్ట్ వశీకరణ్(రజనీకాంత్)ని కలుస్తాడు. వశీకరణ్, తన హ్యుమనాయిడ్ లేడీ రోబోట్ వెన్నెల(ఎమీజాక్సన్)తో కలిసి సెల్‌ఫోన్స్ ఏమయ్యాయనే దానిపై ఆరా తీస్తూ పోతే ఓ నెగటివ్ ఎనర్జీ వశీకరణ్‌పై దాడి చేస్తుంది. అలాంటి నెగటివ్ ఎనర్జీని తట్టుకోవాలంటే సూపర్ పవర్ కావాలని అందుకోసం చిట్టిని మళ్లీ యాక్టివేట్ చేస్తానని అంటాడు వశీకరణ్. కానీ హోం మినిష్టర్ ఒప్పుకోడు. ఈలోపు పెద్ద సెల్‌ఫోన్ షాప్ యజమాని, సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్, టెక్నాలజీ మినిష్టర్ అంతు చిక్కకుండా చనిపోతారు. చివరరకు హోం మినిష్టర్ ఒప్పుకోవడంతో చిట్టి రంగంలోకి దిగి అసలు ఆ నెగటివ్ ఎనర్జీని ఎదుర్కొంటాడు. చివరకు ఆ నెగటివ్ ఎనర్జీ ప్రొఫెసర్ పక్షిరాజు(అక్షయ్‌కుమార్) అని తెలుస్తుంది. అసలు పక్షి రాజు ఎవరు? అతనికి నెగటివ్ ఎనర్జీ ఎందుకు వచ్చింది? సెల్‌ఫోన్స్‌కు, పక్షిరాజుకు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- నటీనటులు
- బ్యాగ్రౌండ్ స్కోర్
- కెమెరా పనితన
- గ్రాఫిక్స్
- శంకర్ టేకింగ్
మైనస్ పాయింట్స్:
- షాకింగ్ ఎలిమెంట్స్ తక్కువ
- ఎమోషన్స్‌లో ఇంకాస్త బలం ఉండాల్సింది.