YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పీఎస్ఎల్వీ-సీ43 ప్రయోగం విజయవంతం

పీఎస్ఎల్వీ-సీ43 ప్రయోగం విజయవంతం
అంతరిక్ష ప్రయోగాల్లో ఆరితేరిన భారత సంస్థ ఇస్రో కు మరో విజయం చేకూరింది. గురువారం ఉదయమం  శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ43 ప్రయోగం విజయవంతమైంది. ఇండియాకు చెందిన శాటిలైట్ తో పాటు మొత్తం 8 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలను ఈ వాహకనౌక కక్ష్యలోకి చేర్చనుంది. భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేసేలా, ఐదేళ్ల పాటు పని చేసే 380 కిలోల శాటిలైట్ 'హైసిస్'ను ఇది కక్ష్యలోకి చేరుస్తుంది. పీఎస్ఎల్సీ సిరీస్ లో ఇది 45వ ప్రయోగం. నింగిలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించిన పీఎస్ఎల్వీ - సీ 43 వాహక నౌక, ఆపై 18 నిమిషాల తరువాత నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ  ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర మండలాల అంచనా వేస్తుంది.  లోతైన నీటి, మట్టి, ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించి అనేక రకాల సమాచారాన్ని సేకరిస్తుంది.  . 380 కిలోల శాటిలైట్ ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు అనందోత్సవాల్లో తేలిపోయారు. 

Related Posts