విజయవాడ సంతోష్ మారుతీ షోరూమ్ లో ఠాగూర్ సినిమా తరహా వ్యవహారం బయటపడింది. డెమోలో మంచికారు చూపించి చెత్త కారు డెలివరీ ఇచ్చారని బాధితుడు వాపోతున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే మభ్యపెట్టి సేల్స్ సిబ్బంది చేతులు దులుపుకున్నారని అందోళనకు దిగాడు. ఆటోనగర్ సమీపంలోని సంతోష్ మారుతీ సుజుకీ షోరూమ్ ఎదుట కఠారి రామకృష్ణ అనే కస్టమర్ ఆందోళన కు దిగాడు. మారుతి ఎర్తిగా కొత్త కారు కొన్న 20 రోజులలో 10 రోజులు షోరూమ్ కే పరిత మైందని కొత్త కారు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. కోనే ముందు చూపించిన కారు, డబ్బులు కట్టిన తరు వాత ఇచ్చిన కారు వేరని అయన వాపోతున్నాడు. షోరూమ్ లో కనీసం పట్టించుకోక పోగా మాకేమి సంభందం లేదంటున్నారని కుటుంబ సభ్యులతో అందోళనకు దిగాడు.